Header Banner

మందు బాబులకు కిక్కిచ్చే వార్త..! భారీగా తగ్గిన బీరు ధరలు!

  Mon May 19, 2025 12:38        Politics

సాధారణంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతుంటాయి. పండగలు, న్యూఇయర్ వంటి ప్రత్యేక సందర్బాల్లో ఈ రికార్డులు బ్రేక్ అవుతుంటాయి కూడా. ఇక ఈ ఏడాది వేసవి కాలం ప్రారంభం అయిన దగ్గర నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో బీర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది అమ్మకాలు భారీగా పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీరు ప్రియులకు భారీ శుభవార్త చెప్పారు. బీర్ల ధరలు దిగి వచ్చాయి. ఆ వివరాలు..

బీర్ ప్రియులకు ఇది మంచి కిక్కిచ్చే వార్త అని చెప్పవచ్చు. కారణం రెండు తెలుగు రాష్ట్రాల్లో బీర్ ధరలు తగ్గనున్నాయి. అయితే ఈ తగ్గుదల కొన్ని బ్రాండ్లకు మాత్రమే పరిమితం కానుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన బీర్ బ్రాండ్ల మధ్య విపరీతమైన పోటీ నడుస్తోంది. అమ్మకాలు పెంచుకొనేందుకు అనేక కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. పైగా రెండు రాష్ట్రాల్లోనూ 2024-25 ఆర్దిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి.

తాజా నిర్ణయంతో బీర్ల రేట్లు తగ్గి.. అమ్మకాలు రెెట్టింపు అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఇంతకు ఆ నిర్ణయం ఏంటంటే.. భారత్, బ్రిటన్ మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. దీని వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశవ్యాప్తంగా బీర్ల ధరలు తగ్గనున్నాయి. ఈ తగ్గింపు పైన నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో బీర్ అమ్మకాలు ప్రతీ నెలా పెరుగుతునే ఉన్నాయి. ఇక వేసవిలో బీర్ అమ్మకాలకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఐదు ప్రధాన బీర్ బ్రాండ్లకు ఇక్కడ భారీ డిమాండ్ ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే రూ .99లకే క్వార్టర్ మద్యం అమ్మకాలు ప్రారంభం అయిన తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లో.. బీర్ విక్రయాలు కొంతమేర తగ్గాయి. అయితే వేసవి ప్రారంభం అయిన దగ్గర నుంచి అంచనాలకు అనుగుణంగా అమ్మకాలు పెరిగాయి. ఇక.. ఇప్పుడు భారత్, బ్రిటన్ మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల.. బీర్ ధరలు మరింత తగ్గనున్నాయి. ఈ ఒప్పందం వల్ల బ్రిటన్ బీర్‌పై పన్ను ఏకంగా 75 శాతం తగ్గింది. దీని కారణంగా యూకే మేడ్ బీర్ల ధరలు మన దగ్గర భారీగా తగ్గనున్నాయి.

తాజా ఒప్పందం వల్ల ఎంపిక చేసిన బ్రిటన్ బీర్ బ్రాండ్లు ఇండియాలో చాలా చౌకగా లభిస్తాయి. ఒప్పందం ముందు వరకు కూడా మన దగ్గర రూ.200 ఉన్న బ్రిటన్ బీర్ ధక తగ్గుముఖం పట్టనుంది. అయితే .. ఏకంగా ఓ బీరు బాటిల్.. కేవలం రూ 50 కే అందుబాటులోకి వస్తుందనేది మాత్రం వాస్తవం కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాకపోతే ఒక్కో బీరు మీద రూ. 20-రూ. 35 వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

2024 లో భారతీయ బీర్ మార్కెట్ విలువ దాదాపు రూ.50,000 కోట్లు. ఇది ప్రతి సంవత్సరం సగటున 8-10శాతం వృద్ధి రేటును కలిగి ఉంది. కేంద్రం ఒప్పందం చేసుకున్నా.. ప్రతీ రాష్ట్రం తమ సొంత ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ పన్నును ఖరారు చేస్తుంది. దీంతో, యూకే బ్రాండ్ల బీర్ ధరలు మాత్రం తగ్గనున్నాయి.


ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #BeerPriceDrop #CheersIndia #BoozeNews #DrinkersDelight #BeerLovers #LiquorUpdate #AlcoholPriceCut